నెల్లూరు జిల్లాలోని తిరగండ్ల దీన్నే గ్రామం దుస్థితి వర్ణనాతీతంగా మారింది. గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు గ్రామం వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. మూడు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తుంది. కనీసం ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విద్యుత్ లేకపోవడం సమస్యగా మారింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.