నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలం పరిధిలో ఉన్న ఘటిక సిద్దేశ్వరంలో శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారు గాయత్రి దేవిగా శనివారం భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు కాశయ్య అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చుట్టూ దట్టమైన అడవి ఉండడంతో అమ్మవారి దర్శనంతో పాటు సేద తీరడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరగడం మరో విశేషం.