వింజమూరు లోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ తో కలిసి జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింస మార్గంలో స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించిన యోధుడు మహాత్మా గాంధీ అని గాంధీజీ మార్గం అన్ని తరాలకు ఆదర్శనీయమన్నారు. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన మహానుభావుడు బాపూజీ అన్నారు.