దుత్తలూరు లోని జాతీయ రహదారిపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద శుక్రవారం ఎస్ఐ ఆదిలక్ష్మి కంట్రోల్ డ్రమ్ములు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మండలంలోని తెడ్డుపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ డ్రమ్ములు ఏర్పాటు చేశామన్నారు. మండలంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్ గా ఏర్పాటు చేశామన్నారు.