నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు ఇన్ ఛార్జ్ డిడివోగా విధులు నిర్వహిస్తున్న ప్రభుదాస్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విధి నిర్వహణలో భాగంగా బైక్ పై కొండాయపాలెం వెళుతుండగా దారి మధ్యలో కోటవర్ధన పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో పామూరు వైద్యశాలకు తరలించారు.