నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జ్ గా ఆదాల
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం అనంతరం ప్రకటించారు.