నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట బివిఎస్ బాలికల పాఠశాల 10 వ తరగతి విద్యార్థిని తుమ్మల పూజిత ఇటీవల భూటాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ "ఆట్యా - పాట్యా" ఛాంపియన్ షిప్ 2023 -24 క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ విద్యార్థినిని ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయములో ఘనంగా సత్కరించారు.