నెల్లూరు: రైలు ఢీకొని విశ్రాంతి ఉద్యోగి మృతి
ఫోనులో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొని విశ్రాంత అటవీశాఖ ఉద్యోగి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు నెల్లూరు లోని నెళ్లిరి బీవీ నగర్ లో అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్(62) నివాసం ఉంటున్నారు. ఆయన సోమవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పని చూసుకొని ఫోనులో మాట్లాడుకుంటూ కొండాయపాలెం రైల్వేగేటు దాటుతుండగా చెన్నై వైపు వెళ్లే రైలు వేగంగా ఢీకొని మృతి చెందారు.