TG: సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని ఆమె మేనల్లుడు తిరుపతి గ్రామ శివారులోని ఉన్న శ్మశాన వాటికలో వదిలేశాడు. కొడుకులు, బిడ్డలు లేకపోవడంతో రాజవ్వ మేనల్లుడితో కలిసి ఉంటుందని సమాచారం. తిరుపతికి కౌన్సెలింగ్ ఇచ్చి రాజవ్వను అధికారులు ఇంటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.