గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సోమవారం నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల రోజులుగా టీచర్లు సమ్మె చేస్తున్న కారణంగా గిరిజన గురుకుల పాఠశాలలో క్లాసులు జరగకా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.