వీధి వ్యాపారుల సంక్షేమానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ధేశాలనిర్దేశాల మేరకు నగరంలో ప్రయోగాత్మకంగా "స్మార్ట్ స్ట్రీట్ బజార్" ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తెలియజేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ వెండింగ్ కమిటీ చైర్మన్ అధ్యక్షునిగా కమిషనర్ సూర్య తేజ ఆధ్వర్యంలో సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు.