ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై సత్వరమే స్పందించాలని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు, జిల్లా పరిషత్ సీఈవో విద్యారమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.