నెల్లూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన సోమశిల కండలేరు - సంగం బ్యారేజ్ , నెల్లూరు బ్యారేజిల వద్ద నీటి నిర్వహణ చేసేందుకు ఆపరేటర్లు లేరని తక్షణం గేట్ల ఆపరేటర్లను ప్రభుత్వం నియమించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రాజెక్టు వద్ద డిఈ, ఏఈ, నిర్వహణ ఆపరేటర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.