విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు, శుక్రవారం నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.