నెల్లూరు: మద్యం షాపు వద్దంటూ ధర్నా

61பார்த்தது
నెల్లూరు: మద్యం షాపు వద్దంటూ ధర్నా
నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం 54 డివిజన్ విజయ పాల బూత్ సెంటర్లో మద్యం షాపు ఏర్పాటు పై బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఐద్వా నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడుతూ, స్కూల్ పిల్లలు మరియు మహిళలు తిరిగే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు అని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ షాపు ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி