నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ముత్తుకూరు జంక్షన్ ఫ్లై ఓవర్ సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న పెయింటింగ్ చిత్రాలను నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక బట్వాడి పాలెం కూడలిలోని ప్రజా మరుగుదొడ్లను ఇంతవరకు ప్రారంభించకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానందుకు అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.