సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం గుంటూరు నల్లపాడు రోడ్డు లో జరిగే మాల మహాగర్జనను విజయవంతం చేయాలని మాల విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు కూరపాటి గోపాల్ కోరారు. శనివారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవం కోసం జరిగే ఈ మహాసభలో ప్రతి గ్రామం నుంచి మాలలు హాజరుకావాలని కోరారు.