సాగునీటి సంఘ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేసిన కోవూరు నియోజకవర్గ రైతు సోదరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లను నెల్లూరు నగరంలో శనివారం ఆమె అభినందించారు. సాగునీటి సంఘ ఎన్నికలలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కించుకున్న నాయకులు ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు.