నెల్లూరు నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య స్థానిక అల్లీపురంలోని డంపింగ్ యార్డును ఫిర్యాదు మేరకు బుధవారం పరిశీలించారు. యార్డు లోపల వరకు చెత్త సేకరణ వాహనాలు వెళ్లకుండా గేటు సమీపంలోనే వ్యర్ధాలు వేస్తున్నది గమనించి, ఇలాంటి విధానం సరికాదని సిబ్బందిని హెచ్చరించారు. తడి పొడి చెత్తను తప్పనిసరిగా విడివిడిగా సేకరించి డంపింగ్ కూడా విడివిడిగా చేయాలని ఆదేశించారు..