అధికారంలోనికి వచ్చిన 6 నెలల వ్యవధిలో అనారోగ్య పీడితులకు 5 సార్లు సీఎం సహాయనిది అందచేసిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కుతుందని వేమిరెడ్డి దంపతులు అన్నారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు శనివారం పంపిణీ చేశారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు 45 లక్షల 89 వేల 334 రూపాయల చెక్కులు పంపిణి చేసినట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వివరించారు.