రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కోవూరు విద్యార్థులు

60பார்த்தது
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కోవూరు విద్యార్థులు
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నెల్లూరు జిల్లా కోవూరు మండలం విద్యార్థులు ఎంపికయ్యారు. మండలంలోని పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షూటింగ్ బాల్ విభాగంలో బాల బాలికల జట్లను బుధవారం ఎంపిక చేశారు. అక్టోబర్ 6, 7వ తేదీలలో కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி