పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బుచ్చిరెడ్డి పాళెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగాలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ప్రతి ఆంధ్రుడూ ఆయన త్యాగాన్ని స్మరించుకోవలసిన అవసరం వుందన్నారు.