నెల్లూరు జిల్లా వైసిపి పార్టీ పిలుపు మేరకు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక సమస్యపై శుక్రవారం నెల్లూరులో వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందిచనున్నారు. కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కావలి నుంచి వైసీపీ నాయకులు వెళ్లారు.