ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు చేపట్టనున్న పశుగణన సర్వేపై 21వ అఖిలభారత పశుగణన పోస్టర్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సర్వే కోసం ఇంటికి వచ్చిన అధికారులకు పశువుల యజమానులు సహకరించాలన్నారు.