కందుకూరు: పంట కాలువ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు సంఘం అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, పలుకూరు చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులుగా సుబ్బారెడ్డి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో వారు ఎమ్మెల్యే ఇంటూరిని కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలకు సాగు గ్రామాలకు తాగునీటి విడుదలలలో కీలక పాత్ర పోషించాలని రైతులు అందరకు మేలు జరిగే విధంగా పని చేయాలని, పంట కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.