లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. దీంతో లింగసముద్రం-కొత్తపేట మధ్య రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది. రాళ్లపాడు ప్రాజెక్టు కుడికాలువకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల రాళ్లపాడు మరమ్మత్తులకు గురి కావడంతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డారు. భారీగా ఆయకట్ట రైతులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు- రైతులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.