1500 కోట్లు పంచాయతీ ఖాతాలకు జమ చేశాం: ఎమ్మెల్యే ఇంటూరి

1071பார்த்தது
గత వైసిపి ప్రభుత్వం ఉద్యోగులను, సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆరోపించారు. "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా కందుకూరులో శుక్రవారం ఆయన పర్యటించారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్జీవంగా మార్చి వేల కోట్లు దారి మళ్లించిందన్నారు. మన ప్రభుత్వం రాగానే 1500 కోట్లు పంచాయతీ ఖాతాలకు జమ చేసామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி