AP: ఈ నెల 30 (ఆదివారం), 31 (సోమవారం) తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఈ రెండు రోజులూ ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ.. రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేస్తారని రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.