బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను ఒడిశా సమీపంలో తీరం దాటి శుక్రవారం రాత్రికి బలహీనపడింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు తెలంగాణలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.