ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఒంగోలులో శుక్రవారం దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పేర్ని నానికి ఘన స్వాగతం పలికారు. జగన్ ఆదేశాల మేరకు బూచేపల్లి పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరైనట్లు నాని తెలిపారు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.