ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ సమీపంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి లిక్కర్ ఫ్యాక్టరీ పెరల్ డిస్టిలరీలో మంగళవారం సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. ఎంపీ లిక్కర్ ఫ్యాక్టరీపై సోదాలు జరగడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సిఐడి అధికారులకు రక్షణగా స్థానిక సీఐ హజరత్తయ్య సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.