కొండేపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ తో కలిసి గురువారం రిమ్స్ ఆస్పత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పర్యవేక్షణ, పారిశుద్ధ్య లోపం ఉన్నట్లుగా గుర్తించామని మంత్రి అన్నారు. అత్యవసర సమయంలో అరుదైన గ్రూపు రక్తం దొరకడం కూడా కష్టంగా మారిందన్నారు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని వారికి మెరుదైన వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.