నివాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహించ వద్దంటూ మహిళలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నివాసానికి మంగళవారం వెళ్లిన మహిళలు కనిగిరిలోని ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటుచేసిన మద్యం దుకాణంను అక్కడి నుండి తీసివేయాలని మహిళలు ఎమ్మెల్యేను కోరారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని వారు తెలిపారు.