మద్యం సేవించి ఆటో నడిపిన డ్రైవర్‌కు మూడు వేల రూపాయలు జరిమానా, మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. మంగళవారం రాత్రి కనిగిరి పామూరు బస్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా, మద్యం తాగి ఆటో నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపరిచారు. కోర్టు తీర్పుతో దర్శి సబ్ జైలుకు పంపించారు.