గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉండడం వల్ల మండలంలో అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇంకా 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు ఆప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలిపారు.