రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో రైతులకు శనగ విత్తనాలను అందిస్తుందని గురువారం గిద్దలూరు వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. రెండు రకాల శనగ విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుందని ఎకరాకు 40 కేజీలు చొప్పున 5 ఎకరాల వరకు రైతులు సబ్సిడీపై పొందవచ్చని అన్నారు. శనగ విత్తనాలు పొందాలనుకునే రైతులు మీ స్థానిక రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు.