యర్రగొండపాలెం లో అక్రమంగా మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్ఐ చౌడయ్య బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 8 క్వాటర్ల మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం బెల్టు షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.