పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కనిగిరిలోని పోలీసు స్టేషన్ ఆవరణ నుండి పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మాన, ప్రాణ, రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయక అసువులు బాసిన పోలీసు సేవలు చిరస్మరణీయమన్నారు.