కనిగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ను కనిగిరి సీఐ ఖాజావలి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను, కేసు డైరీలు, రిజిస్టర్లను వారు పరిశీలించారు. రికార్డులని సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అని తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.