సీఎస్ పురం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరుగుతున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం త్వరితగతిన కృషి చేస్తానని ఎమ్మెల్యే ఉగ్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.