గిద్దలూరులో భవన నిర్మాణ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కార సాధన కోసం ఈ నెల 18వ తేదీన మండల తాసిల్దార్ కార్యాలయాలలో ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక నాయకులు పట్టణంలో సోమవారం కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మెమో
1214 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, నియోజకవర్గంలో ఇసుక డంపింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.