AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం ప.గో. జిల్లాలో పర్యటించనున్నారు. తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుకొండ గ్రామాల అభివృద్ధికి పవన్ ఆలోచన చేస్తున్నట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామంలో పర్యటిస్తారు. అభివృద్ధి సభలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులతో సమావేశమవుతారు.