మెంటాడ మండల కేంద్రంలోని సంతతోట వద్ద గల మద్యం మద్యం షాపు నుంచి మంగళవారం సాయంత్రం 18 మద్యం సీసాలు కొండపర్తికి ఒక వ్యక్తి తరలిస్తుండగా పట్టుబడినట్లు ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ సీతారాం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు.