పార్వతీపురం మండలం బడిదేవరకొండపై ఎంఎస్పి కంపెనీ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని బడిదేవరకొండపై చేపడుతున్న గ్రానైట్ తవ్వకాలను వామపక్ష, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కొండ సమీపంలో ఉన్న గ్రామాల్లో ఆదివాసీలు, రైతులతో సమావేశమయ్యారు. వారంతా గ్రానైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు.