పాలకొండ: రాష్ట్రంలో హిందీ పండిత శిక్షణ కళాశాలలను పునరుద్ధరించాలని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రతినిధి బృందం స్పీకర్ అయ్యన్నపాత్రుడిని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం గురువారం అందజేశారు. హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ గైబువల్లి, ఉపాధ్యక్షులు శ్రీరాములు, పాలకొండకు చెందిన ఏపీ హిందీ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు, ప్రచార సంచాలకులు శ్రీధర్, పాల్గొన్నారు.