నెల్లిమర్ల మండలం సారిపల్లిలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఆదేశాలతో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారి శనివారం ఎంపీడీవో రామకృష్ణంరాజుతో కలిసి పరిశీలించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి వడపోసిన నీటిని తాగాలని తెలిపారు. గ్రామంలో క్లోరినేషన్ చేసిన నీటిని ప్రజలకు సరఫరా చేయాలని తెలిపారు. శానిటేషన్ పనులను విస్తృతం చేయాలని తెలిపారు.