విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో డిసెంబర్ 1 న ధర్నా నిర్వహించనున్నట్లు డిఎస్పి నెల్లిమర్ల నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకొండ వెంకటరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లిమర్లలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. వేలాది మంది కార్మికులు విశాఖ ఉక్కు పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.