రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అధికారులు ముమ్మరం చేశారు. కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఎంపిడిఓ ఆధ్వర్యంలో శనివారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి స్టిక్కర్లు అందజేశారు.