మన్యం జిల్లా, కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామంలో బుధవారం రూట్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నీలకంఠాపురం పి. హెచ్. సి నందు నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైంది. 112 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో 42 మందిని శస్త్ర చికిత్సకు తీసుకొని వెళ్లడం జరుగుతుందని వైద్యులు తెలిపారు.