వైద్యులు ఎఫ్ఆర్ఎస్ లో అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం అన్నారు. సదరం సర్టిఫికేట్ కోసం ఆసుపత్రికి చాలా దూరం నుండి వచ్చే రోగులకు వీలైతే భోజనం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి సదరం సర్టిఫికేట్ జారీ గాని, సదరం వెబ్ సైట్ స్లాట్స్ బుక్ చేసుకొనే చర్యలు తీసుకుంటామని అన్నారు.